Saturday, 4 March 2017

5 మార్చి 2017

ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వలన మాట పడవలసి వస్తుంది. మార్కెటింగ్, ప్రైవేటు, పత్రికా రంగంలోని వారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు, వ్యవహారాలు, పాత సమస్యలు పరిష్కార మార్గంలో పయనిస్తాయి. ప్రముఖుల కలియిక ప్రయోజనకరంగా ఉంటుంది.

Saturday, 25 February 2017

26 ఫిబ్రవరి 2017

ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు వీడనాడి విధినిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. మిమ్మల్ని పొగిడే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఖర్చులు మీ రాబడికి మించడం వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు.

Thursday, 23 February 2017

24 ఫిబ్రవరి 2017

సన్నిహితుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు, గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి.

Wednesday, 22 February 2017

23 ఫిబ్రవరి 2017

ప్రయాణాలలో చికాకులను ఎదుర్కొంటారు. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలో వారికి చికాకులు తప్పవు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనపడుతుంది. చిన్నతరహా పరిశ్రమలలోని వారికి అభివృద్ధి, సంతృప్తి కానవస్తుంది. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్‌వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి.

Tuesday, 21 February 2017

22 ఫిబ్రవరి 2017

ఖర్చులు అధికం కావటంతో చేబదుళ్లు తప్పదు. కళారంగాల వారికి యోగప్రదమైన కాలం. పెట్టుబడులు సమకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలను దర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పాత అలవాట్లకు స్వస్తి చెప్పి, కొత్తవాటిని అలవర్చుకోండి.

Sunday, 19 February 2017

20 ఫిబ్రవరి 2017

గృహ నిర్మాణాలు, మరమ్మతులు సజావుగా పూర్తవుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రైవేటు సభలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధుమిత్రులు మీ నుంచి ధన సహాయం ఆశిస్తారు. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

Saturday, 18 February 2017

19 ఫిబ్రవరి 2017

కాంట్రాక్టర్లకు రావలసిన ధనం సకాలంలో అందటంతో మీలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. వాదోపవాదాలకు, భేషజాలకు దూరంగా ఉండటం మంచిది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో మెలకువ వహించండి. మిత్రులను కలుసుకుంటారు.