ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వలన మాట పడవలసి వస్తుంది. మార్కెటింగ్, ప్రైవేటు, పత్రికా రంగంలోని వారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు, వ్యవహారాలు, పాత సమస్యలు పరిష్కార మార్గంలో పయనిస్తాయి. ప్రముఖుల కలియిక ప్రయోజనకరంగా ఉంటుంది.
Saturday, 4 March 2017
Saturday, 25 February 2017
26 ఫిబ్రవరి 2017
ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు వీడనాడి విధినిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. మిమ్మల్ని పొగిడే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఖర్చులు మీ రాబడికి మించడం వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. మీరు చేసిన పనికి ప్రత్యుపకారం పొందుతారు.
Thursday, 23 February 2017
24 ఫిబ్రవరి 2017
సన్నిహితుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు, గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి.
Wednesday, 22 February 2017
23 ఫిబ్రవరి 2017
ప్రయాణాలలో చికాకులను ఎదుర్కొంటారు. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలో వారికి చికాకులు తప్పవు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనపడుతుంది. చిన్నతరహా పరిశ్రమలలోని వారికి అభివృద్ధి, సంతృప్తి కానవస్తుంది. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్‌వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
Tuesday, 21 February 2017
22 ఫిబ్రవరి 2017
ఖర్చులు అధికం కావటంతో చేబదుళ్లు తప్పదు. కళారంగాల వారికి యోగప్రదమైన కాలం. పెట్టుబడులు సమకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలను దర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పాత అలవాట్లకు స్వస్తి చెప్పి, కొత్తవాటిని అలవర్చుకోండి.
Sunday, 19 February 2017
20 ఫిబ్రవరి 2017
గృహ నిర్మాణాలు, మరమ్మతులు సజావుగా పూర్తవుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రైవేటు సభలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధుమిత్రులు మీ నుంచి ధన సహాయం ఆశిస్తారు. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.
Saturday, 18 February 2017
19 ఫిబ్రవరి 2017
కాంట్రాక్టర్లకు రావలసిన ధనం సకాలంలో అందటంతో మీలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. వాదోపవాదాలకు, భేషజాలకు దూరంగా ఉండటం మంచిది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో మెలకువ వహించండి. మిత్రులను కలుసుకుంటారు.
Friday, 17 February 2017
18 ఫిబ్రవరి 2017
స్త్రీలకు ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. విద్యార్థులకు తమ ధ్యేయంపట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులు మీ నుంచి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు. ట్రాన్స్‌ఫోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. భూములు, స్థలాలు కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. బిల్లులు చెల్లిస్తారు.
Thursday, 16 February 2017
17 ఫిబ్రవరి 2017
నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. కలప, ఐరన్, సిమెంట్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్థలాల క్రయ, విక్రయాలు అనుకూలిస్తాయి. నిర్మాణ పనుల వ్యయం మీ అంచనాలను మించుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
Wednesday, 15 February 2017
16 ఫిబ్రవరి 2017
ఆస్తి వ్యవహారాలకు సంబంధించి కుటుంబీకులతో ఒక అవగాహనకు వస్తారు. చిన్నతరహా పరిశ్రమల వారికి అన్నవిధాలా కలసి వస్తుంది. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. కార్మికులకు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వైద్యులకు శస్త్ర చికిత్సలలో ఏకాగ్రత అవసరం.
Tuesday, 14 February 2017
15 ఫిబ్రవరి 2017
కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ చిరు వ్యాపారులకు ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. మత్స్య, పాడి పరిశ్రమల వారికి సామాన్యం. ముఖ్యమైన విషయాలలో అనాలోచితంగా వ్యవహరించటం వల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేడుకలు, శుభకార్యాలలో స్త్రీలు ప్రత్యేక గుర్తింపు పొందుతారు.
Monday, 13 February 2017
14 ఫిబ్రవరి 2017
ట్రాన్స్‌ఫోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలోని వారికి అనుకూలమైన కాలం. పాత మిత్రుల కలయిక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మీ మాటకు ఇంటా బయటా ఆదరణ లభిస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు.
Sunday, 12 February 2017
13 ఫిబ్రవరి 2017
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి అన్నివిధాలా కలసి రాగలదు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
Saturday, 11 February 2017
12 ఫిబ్రవరి 2017
ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలం అవుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. స్పెక్యులేషన్ కలసిరాదు.
Friday, 10 February 2017
11 ఫిబ్రవరి 2017
విరోధులు వేసే పథకాలు తెలివితో త్రిప్పికొట్టగలుగుతారు. కాంట్రాక్టర్లకు ఎప్పటినుంచో ఆగి ఉన్న పనులు పునఃప్రారంభం అవుతాయి. ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలం అవుతాయి. రాబడికి మించిన ఖర్చులు ఎదురైనా ప్రయోజనకరంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు ఒత్తిడి, చికాకులు అధికం అవుతాయి.
Thursday, 9 February 2017
10 ఫిబ్రవరి 2017
వస్త్ర వ్యాపారస్తులకు సామ్యంగా ఉండును. కొత్త పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. చిన్న చిన్న విషయాలలో సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. ఫైనాన్స్, చిట్‌ఫండ్, మేకింగ్ రంగాల వారికి పనిభారం అధికం అవుతుంది.
Wednesday, 8 February 2017
9 ఫిబ్రవరి 2017
ఆస్తి వ్యవహారాలలో ముఖ్యులతో చర్చలు జరుపుతారు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ సంకల్పం త్వరలోనే కార్యరూపం దాల్చుతుంది. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి.
Tuesday, 7 February 2017
8 ఫిబ్రవరి 2017
కీలకమైన వ్యవహారాలలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. ఎల్.ఐ.సి., పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం ఎంతో ముఖ్యం. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి.
Monday, 6 February 2017
7 ఫిబ్రవరి 2017
కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొర్రెల రంగాలలోనివారికి అనుకున్నంత సంతృప్తి కానవచ్చును. సంఘంలో పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు. విద్యార్థులు ఆందోళనలకు గురౌతారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కలవరపెడతాయి. సహోద్యోగులతో అనుబంధాలు బలపడతాయి. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన అమలులో పెడతారు.
Sunday, 5 February 2017
6 ఫిబ్రవరి 2017
ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి నిరుత్సాహం, ఒత్తిడి చికాకులు ఎదుర్కొనక తప్పదు. వస్త్ర వ్యాపారస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటంవల్ల శుభం చేకూరుతుంది. సోదరీ, సోదరులతో అవగాహనా లోపం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. మీ వ్యక్తిగత విషయాలు బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచండి.
Saturday, 4 February 2017
5 ఫిబ్రవరి 2017
కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం. వ్యవసాయ, తోటల రంగాలలోని వారికి అనుకున్నంత సంతృప్తి కానరాదు. చేపట్టిన పనులలో నెమ్మదిగా పురోభివృద్ధి కానవస్తుంది. రాబడికి తగ్గ ఖర్చు ఉండటంవల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. రిప్రజెంటేటివ్‌లకు, పోస్టల్ రంగంలోని వారి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
Friday, 3 February 2017
4 ఫిబ్రవరి 2017
ఉపాధ్యాయులకు, కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి పురోభివృద్ధి. సన్నిహితుల ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. స్పెక్యులేషన్ రంగాలపట్ల ఏకాగ్రత వహిస్తారు. ఏక్స్‌పోర్టు, ట్రాన్సుపోర్టు రంగాల వారికి పురోభివృద్ధి. ముఖ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ వాక్చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
Thursday, 2 February 2017
3 ఫిబ్రవరి 2017
చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. సన్నిహితుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం, వస్తుప్రాప్తి లాంటి శుభ ఫలితాలుంటాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం.
Wednesday, 1 February 2017
2 ఫిబ్రవరి 2017
విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మీ సమర్థతకు అవకాశాలు కలసివస్తాయి. సమావేశానికి ఏర్పాట్లు చేయటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీలు అపరిచిత వ్యక్తులపట్ల మెలకువగా ఉండాలి. రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే ఆస్కారం ఉంది.
Tuesday, 31 January 2017
1 ఫిబ్రవరి 2017
ప్రభుత్వ ఉద్యోగులకు కలసివస్తుంది. దూరపు ప్రయాణాలు వాయిదా పడవచ్చు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికం అవుతాయి. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దూరదేశాల వారినుంచి ఆసక్తికరమైన వార్తలు వింటారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం.
Monday, 30 January 2017
31 జనవరి 2017
షేర్లు, యూనిట్ల కొనుగోళ్లు లాభదాయకంగా ఉంటాయి. హోటల్, కేటరింగ్, తినుబండారాల వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉన్నా, రాబడి విషయంలో సంతృప్తికరంగా ఉండదు. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సంతానం విద్య, వివాహ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
30 జనవరి 2017
కిరాణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఆశాజనకం. ఉమ్మడి నిధుల నిర్వహణలో మాటపడాల్సి వస్తుంది. సన్నిహితుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులౌతారు.
Saturday, 28 January 2017
29 జనవరి 2017
ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. ఖర్చులు పెరగటంతో రుణయత్నాలు, చేబదుళ్లు తప్పవు. నూతన వస్తువులను అమర్చుకుంటారు. గృహ నిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవటంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అకాల భోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతిలోపంవల్ల అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతారు.
Friday, 27 January 2017
28 జనవరి 2017
చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెలకువ అవసరం. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ముందుచూపుతో వ్యవహరించటం మంచిది. ప్రముఖులను కలుసుకుని సంప్రదింపులు జరుపుతారు. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి.
Thursday, 26 January 2017
27 జనవరి 2017
ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. స్త్రీలు అయినవారి నుంచి ఆసక్తికరమైన విషయాలను గ్రహిస్తారు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. క్రయ విక్రయాలు ఆశించినంత లాభసాటిగా ఉండవు. ప్రయాణాలలో చికాకులు తప్పవు.
Wednesday, 25 January 2017
26 జనవరి 2017
కోర్టు వ్యవహారాలు వాయిదా పడే సూచనలున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఏకాగ్రత, పెద్దల సలహా పాటించటం క్షేమదాయకం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి.
Tuesday, 24 January 2017
25 జనవరి 2017
ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం ఉంటాయి. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆశయం నెరవేరదు. మీ సంతానం మొండితనంవల్ల అసహనానికి గురవుతారు. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది.
24/01/2017
ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో మెలకువ వహించండి. తలచిన కార్యములు నెరవేరతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు, కీలకమైన వ్యవహారాలలో మెలకువ వహించండి. స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదురవుతాయి.
Subscribe to:
Comments (Atom)