Tuesday, 31 January 2017

1 ఫిబ్రవరి 2017

ప్రభుత్వ ఉద్యోగులకు కలసివస్తుంది. దూరపు ప్రయాణాలు వాయిదా పడవచ్చు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు అధికం అవుతాయి. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దూరదేశాల వారినుంచి ఆసక్తికరమైన వార్తలు వింటారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం.

Monday, 30 January 2017

31 జనవరి 2017

షేర్లు, యూనిట్ల కొనుగోళ్లు లాభదాయకంగా ఉంటాయి. హోటల్, కేటరింగ్, తినుబండారాల వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉన్నా, రాబడి విషయంలో సంతృప్తికరంగా ఉండదు. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సంతానం విద్య, వివాహ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.

30 జనవరి 2017

కిరాణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఆశాజనకం. ఉమ్మడి నిధుల నిర్వహణలో మాటపడాల్సి వస్తుంది. సన్నిహితుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులౌతారు.

Saturday, 28 January 2017

29 జనవరి 2017

ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. ఖర్చులు పెరగటంతో రుణయత్నాలు, చేబదుళ్లు తప్పవు. నూతన వస్తువులను అమర్చుకుంటారు. గృహ నిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవటంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అకాల భోజనం, శ్రమాధిక్యత, విశ్రాంతిలోపంవల్ల అప్పుడప్పుడు అస్వస్థతకు గురవుతారు.

Friday, 27 January 2017

28 జనవరి 2017

చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెలకువ అవసరం. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ముందుచూపుతో వ్యవహరించటం మంచిది. ప్రముఖులను కలుసుకుని సంప్రదింపులు జరుపుతారు. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి.

Thursday, 26 January 2017

27 జనవరి 2017

ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. స్త్రీలు అయినవారి నుంచి ఆసక్తికరమైన విషయాలను గ్రహిస్తారు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. క్రయ విక్రయాలు ఆశించినంత లాభసాటిగా ఉండవు. ప్రయాణాలలో చికాకులు తప్పవు.

Wednesday, 25 January 2017

26 జనవరి 2017

కోర్టు వ్యవహారాలు వాయిదా పడే సూచనలున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఏకాగ్రత, పెద్దల సలహా పాటించటం క్షేమదాయకం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి.

Tuesday, 24 January 2017

25 జనవరి 2017

ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం ఉంటాయి. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆశయం నెరవేరదు. మీ సంతానం మొండితనంవల్ల అసహనానికి గురవుతారు. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది.

24/01/2017

ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో మెలకువ వహించండి. తలచిన కార్యములు నెరవేరతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు, కీలకమైన వ్యవహారాలలో మెలకువ వహించండి. స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదురవుతాయి.